కోట్లను అవమానించారంటూ నిరసన | kotla suryaprakash reddy followers lock dcc office in kurnool | Sakshi
Sakshi News home page

కోట్లను అవమానించారంటూ నిరసన

Published Wed, Feb 3 2016 12:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కోట్లను అవమానించారంటూ నిరసన - Sakshi

కోట్లను అవమానించారంటూ నిరసన

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నేతలు అవమానించారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న సభ వేదికపైకి కోట్లను ఆహ్వానించనందుకు నిరసన తెలిపారు.

బుధవారం కర్నూలు డీసీసీ కార్యాలయానికి కోట్ల వర్గీయులు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కోట్లను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన బహిరంగ సభలో మన్మోహన్, రాహుల్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement