మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
డోన్ (కర్నూలు): జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలను దిగమింగారని ఆరోపించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలు చెలరేగిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీనీవా కాల్వనీటితో చెరువులను నింపే హామీని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నాలుగేళ్లు గడిచినా నెరవేర్చలేకపోయామన్నారు. కర్నూలులో ఆగస్టు 18న నిర్వహించే మహాసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment