'ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది' | farmer union minister kotla suryaprakash reddy slams chandrababu | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది'

Published Mon, Sep 12 2016 2:36 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

farmer union minister kotla suryaprakash reddy slams chandrababu

ఆలూరు: కర్నూలు జిల్లా  ఆలూరు మండలం హరికేర గ్రామంలో ఎండిన పంటలను మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఈ నెల 2వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించారన్నారు. సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్‌గన్‌లు కొనుగోలు చేసి 7.5 లక్షల ఎకరాల పంటను కాపాడామని బూటకపు మాటలు చెప్పాడని విమర్శించారు. పరిస్థితిని చూస్తే ఇక్కడ పంటలన్నీ ఎండిపోయాయన్నారు. పంటలు ఎండిపోయి ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్కడి మహిళలు మాజీ కేంద్రమంత్రి ఎదుట ఆవేదన వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement