
కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గౌరవంగా విందుకు ఆహ్వానించగా అతిథిగా వెళ్లొచ్చానని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బుధవారం కర్నూలులోని స్వృగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక హోదా తదితర సున్నిత అంశాలపై చర్చించామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధి కోసం తనతో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కోరినట్లు వెల్లడించారు. పార్టీ మారతారని ప్రచారం జరుగుతోందన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment