తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలోకి మరే ప్రసక్తే లేదని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. కోట్ల కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటానని, పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు.