హిందూపురం అర్బన్ : రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బకాయి పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ప్రజా పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ స¿¶ లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.650 కోట్లు వెచ్చించి శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే సక్రమంగా నిర్వహణ చేయకుండా టీడీపీ నాయకులు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ కావాలంటే పచ్చ చొక్కా వేసుకోవాలనేంత దయనీయమైన పాలన చేస్తున్నామని ఎద్దేవా చేశారు. 2013లో కాంగ్రెస్ హయంలో రూ.1,600 ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినా ఇంతరవకు ఇవ్వలేదన్నారు. మూడేళ్లు పంట చేతికందకున్నా పంట నష్టపరిహారంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని వాపోయారు.
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవాకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాల్సిందేనన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచారని చంద్రబాబు చెబుతున్నారు.. అదే బిల్లులో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని గుర్తుచేశారు. సభలో ఏపీ కిసాన్lసెల్ రాష్ట్ర కార్యదర్శి రవికిషోర్, పీసీసీ సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ అబ్దుల్‌వహిద్, స్థానిక నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, యువజన కాంగ్రెస్ కన్వీనర్ రెహమత్ ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు పోరుబాట డిమాండ్ల వినతిపత్రం అందజేశారు.
రైతులకు చంద్రబాబు బకాయిపడ్డారు
Published Sat, Sep 3 2016 11:22 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement