సాక్షి, కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీకి మనుగడ లేదని విమర్శించారు. ఓ బీజేపీ నాయకుడి మాటలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారని... కనీసం తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని దుస్థితిలో పార్టీ ఉందని మండిపడ్డారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. (కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్)
ఇక కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలోనూ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరగుతోంది.(టీడీపీకి షాక్: వైఎస్సార్‌సీపీలోకి కరణం వెంకటేశ్)
Comments
Please login to add a commentAdd a comment