
గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఈ నెల తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ముఖ్యమంత్రి అనుమతితోనే ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పష్టత ఇవ్వాలని కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాలకు కేఈ దూరంగా ఉన్నారంటూ కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు.