
కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: ముందు చూపుతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ను కొనుగోలు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ మొండి వైఖరి వల్లే రాయలసీమకు నీటి కష్టాలు వచ్చాయని తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడం తప్పు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఏపిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూరుస్తుందన్నారు. అనంతపురంలో విమానాశ్రయం నిర్మాణానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు.
**