సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘ పవన్ అంటే గాలి. గాలి వార్తలు నమ్మడం తప్ప ఆయనకు ఆలోచించే శక్తి లేదు. పవన్ ఒక అజ్ఞాతవాసి. రీల్ లైఫ్.. రియల్ లైఫ్ వేరని గుర్తించాలి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం ఆయనకు అలవాటైంది. ప్రజా క్షేత్రంలో ఉండేవారు బాధ్యతగా మెలగాలి కానీ తప్పుడు ప్రచారాలు చేయకూడదు.
అమరావతి భూముల విషయంలో కూడా పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజధానికి 99 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధానిలో పవన్ పర్యటిస్తే అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారు. రమణదీక్షితులు విశ్వనీయత లేని వ్యక్తి. అలాంటి వ్యక్తులకు పవన్ మద్దతు తెలపడం రాజకీయ కుట్రే. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment