సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట తపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలతో పాటు, బార్బర్ షాపులు కూడా బంద్ పాటించాలని సూచించాయి.
ఆలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment