బాబు చేతిలోనే ఉప ముఖ్యమంత్రి పదవి | Babu the hands of the Deputy Chief Minister | Sakshi
Sakshi News home page

బాబు చేతిలోనే ఉప ముఖ్యమంత్రి పదవి

Published Fri, Jan 2 2015 3:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

Babu the hands of the Deputy Chief Minister

ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల
 
గుంతకల్లు:పేరుకు బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇచ్చారని,  ఆ హోదా గౌరవాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తికి సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవ్వలేదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు.   డెప్యూటీ సీఎం పదవిని కేఈ కృష్ణమూర్తికి ఇచ్చారే కానీ అధికారాలను బాబు తన చేతుల్లో ఉంచుకున్నారన్నారు.

చంద్రబాబునాయుడు ఆరు నెలల పాలనలో అనేకసార్లు విదేశీ పర్యటన చేసి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారన్నారు. విదేశీ పర్యటన ఖర్చులు, కొత్త వాహనాలు, గృహ వాస్తు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆయన ఖర్చులతో డ్వాక్రా మహిళల రుణాలు కొంతలోకొంత మాఫీ అయ్యేవన్నారు.  ఎలాంటి షరతులు విధించకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement