
కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌ను దరిద్రంగా పేర్కొనడం సబబు కాదన్నారు. కాంగ్రెస్‌ను వీడినందుకు అలా అంటున్నారని, రేపు టీడీపీని వీడినా అలా చెప్పరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. విజ్ఞులై ఉండి అలాంటి పదాలు వాడటం మంచిది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment