సాక్షి, తాడేపల్లి: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్.. అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటుగానే ఇతర నేతలు పోరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, తకియాసాహెబ్, వినయ్ కుమార్‌లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్ధుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. అహ్మద్ అలీఖాన్ పార్టీలో చేరినందుకు వీరంతా హర్షం వ్యక్తం చేశారు.
ఇక, అహ్మద్ అలీఖాన్.. కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎమ్మెల్యేగా, 2019లో కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతోంది. పాఠశాలలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. అధిష్టానం సూచించిన విధంగా నేను పనిచేస్తాను అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మన విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగం కావాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment