తంతారో, కొడతారో మీ ఇష్టం... | Deputy cm KE krishnamurthy comments on officers | Sakshi
Sakshi News home page

తంతారో, కొడతారో మీ ఇష్టం...

Published Wed, Jun 18 2014 12:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

తంతారో, కొడతారో మీ ఇష్టం...

తంతారో, కొడతారో మీ ఇష్టం...

డోన్ : 'తంతారో, కొడతారో మీ ఇష్టం... అధికారులతో మీకు అవసరమైన పనులు చేయించుకోండని' ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా డోన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవసరమొచ్చినా అధికారులను కలిసి పనులు చేయించుకోవాలన్నారు. తన పని అయిపోయిందని ప్రచారం చేసినవారు ఇప్పుడు తాను చేపట్టిన పదవిని చూసి భయాందోళన చెందుతున్నారన్నారు.

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అయిదు పర్యాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న డోన్ ప్రజలను ఎన్నటికీ వీడనని అన్నారు. ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తానన్నారు. రాయలసీమను కాపాడి కర్నూలు జిల్లాను సింగపూర్ చేస్తావో....మలేషియాగా తీర్చిదిద్దుతావో నీ ఇష్టమని బాబు చెప్పారని ఈ సందర్భంగా కేఈ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement