రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
కర్నూలు : కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఆయన తంగడంచె గ్రామంలో అల్ట్రా మెగా పుడ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముఖాముఖి మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు. మెగా పుడ్ పార్కుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. కర్నూలు, గుంటూరు మధ్య 6 లేన్ల రహదారిని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమ కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు.