చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు | KE Krishnamurthy comments over chandrababu Behaviour | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు

Published Sun, Dec 25 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు

చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు

రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కర్నూలు (లీగల్‌): ముఖ్యమంత్రి చంద్రబా బు ఎన్‌టీఆర్‌లా ముక్కుసూటి మనిషి కాదని, అన్నింటికీ చూద్దాం.. చేద్దాం అంటూ ఆలోచించే మనిషి అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూ ర్తి వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనకు వస్తే ఏమడు గుతారో అని ఆలోచిస్తున్నారన్నారు. శనివారం కర్నూలు లో నిర్వహించిన రాష్ట్ర న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘గతంలో నేను ఎన్‌టీఆర్‌ మంత్రివర్గంలో నాలుగున్నరేళ్లు మంత్రి గా పని చేశాను.  ఆయనకు సన్నిహితంగా ఉండి జిల్లాకు కావాల్సిన పనులను చేయించుకున్నా. ప్రస్తుతం బాబును జిల్లా అభివృద్ధి గురించి ఏమైనా అడిగితే ఆలోచిద్దాం.. కొత్త రాష్ట్రం కదా.. నిధుల కొరత అంటున్నారు. జిల్లాకు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు మంజూరైనా జిల్లాకు వస్తే మళ్లీ ఏమడుగుతారోనని సీఎం అనుకుంటున్నారు. దాదాపు ఏడు పరిశ్రమలు మంజూరైనా ప్రారంభోత్సవాలు చేద్దామంటే సీఎం స్పందించట్లేదు. ఈ విషయాలన్నీ ఎంపీ టి.జి.వెంకటేష్‌కే తెలియాలి’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement