
రాహుల్ గాంధీకి ఏపీలో పర్యటించే హక్కు లేదు: కేఈ
అమరావతి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే హక్కు లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌గాంధీ పర్యటన చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రస్తావించారా అని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగసభను ప్రజలే బహిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆయన తెలిపారు.