
'హోదా' మరచి విదేశీ పర్యటనలా: భూమా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) ఆరోపించారు. గురువారం ఆయన కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్న ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
పట్టిసీమ కోసం హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తుంటూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమర్థించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోటార్లను తరలించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో రిజర్వాయర్లను కూడా తరలిస్తుందని భూమానాగిరెడ్డి పేర్కొన్నారు.