
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు విషయంపై టీడీపీలో సెగ పుడుతోంది. కాంగ్రెస్ దౌర్భాగ్యం తమకెందుకని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల వ్యాఖ్యానించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్‌టీఆర్ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు. ధర్మపోరాటం సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ నేతలు ఇరువురు మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment