హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీ భూముల కోసం జిల్లాల్లో పర్యటించనున్నట్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పర్యటన అనంతరం ఖాళీ భూములపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన సోమవారమిక్కడ చెప్పారు.
గత ప్రభుత్వంలో సెజ్‌లు, పరిశ్రమలకు కేటాయించిన భూములు వినియోగించకుండా ఉన్న భూములు ఎలా స్వాధీనం చేసుకోవాలో తర్వాత నిర్ణయిస్తామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. వినియోగంలో లేని భూములను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.