హైదరాబాద్ : రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదని ఓ వైపు ఆర్బీఐ తేల్చి చెప్పినా.... తెలుగు దేశం పార్టీ మాత్రం ఇప్పటికీ రుణమాఫీ సాధ్యమేనంటూ కథలు చెబుతోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో మాట్లాడి సంపూర్ణ రుణమాఫీ చేస్తామంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఊహాగానాలు వద్దని కేఈ కృష్ణమూర్తి సూచించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సమీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాయలసీమను ఇండస్ట్రీస్ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని కేఈ వెల్లడించారు.
కాగా రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది. ఇదంతా తెలిసినా టీడీపీ మాత్రం రుణమాఫీ సాధ్యమే అంటూ రైతుల్ని నమ్మించే యత్నం చేస్తోంది.
సంపూర్ణ రుణమాఫీ సాధ్యమేనంటున్న టీడీపీ
Published Sat, Jul 5 2014 11:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement