crop loan waive
-
ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాంధారిలో రైతులతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణ సర్కార్‌పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. శుక్రవారం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందని నిర్మల ఆరోపించారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. 2017 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్స్ చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో రుణమాఫీపై హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం వందలో ఐదుగురు రైతులకు మాత్రమే చేసినట్లు చెప్పారు. మల్లన్నసాగర్ ,మిడ్ మానేరు ,సీతారామ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటిదాకా పూర్తి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న వేయొద్దని, వరి వేస్తే ఉరేనంటూ రైతులను తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందని నిర్మల ఫైర్ అయ్యారు. అందరివాడైన రైతు సమస్యలను కేసీఆర్ సర్కార్ రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని రైతు సమస్యలకు అనుగుణంగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తోందని నిర్మల అన్నారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు -
10 నుంచి తొలివిడత రుణమాఫీ: చంద్రబాబు
-
10 నుంచి తొలివిడత రుణమాఫీ: చంద్రబాబు
హైదరాబాద్: అర్హులైన వారందరికీ పంట రుణమాఫీ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీయిచ్చారు. ఈనెల 10 నుంచి రూ. 50 వేలలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. 6న లబ్దిదారుల జాబితాను ఇంటర్నెట్ లో పెడతామన్నారు. అభ్యంతరాల స్వీకరణకు 9న గ్రీవెన్ సెల్, కాల్ సెంటర్ పెడతామని తెలిపారు. రుణమాఫీపై గురువారం ఆయన విధాన ప్రకటన చేశారు. మొదటి దశ రుణాలు ఇప్పుడు మాఫీ చేస్తున్నామన్నారు. 22 లక్షల 79 కుటుంబాలకు తొలివిడతగా రుణమాఫీ చేస్తామన్నారు. నాలుగు వారాల తర్వాత రెండో దశ రుణమాఫీ ఉంటుందని తెలిపారు. తమ కాన్సెప్ట్ ప్రకారం రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రెండో విడతలో సర్టిఫికెట్లు ఇచ్చి నాలుగు విడతలుగా 10 శాతం వడ్డీతో చెల్లిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్షన్నర సీలింగ్ పెట్టామన్నారు. 01-04-2007 నుంచి 31-12-2013 వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రూ. 50 వేల లోపు రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో నలుగురు రూ. లక్షన్నర కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ప్రొడేటా ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీకి ఆధార్, రేషన్ కార్డులు తప్పనిసరి అని చెప్పారు. రేషన్ కార్డులు లేనివారి వివరాలు జన్మభూమి కమిటీల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ఒకే సర్వే నంబర్ లో భూమి యజమాని, కౌలు రైతు రుణం తీసుకుంటే.. కౌలు రైతుకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. -
సంపూర్ణ రుణమాఫీ సాధ్యమేనంటున్న టీడీపీ
హైదరాబాద్ : రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదని ఓ వైపు ఆర్బీఐ తేల్చి చెప్పినా.... తెలుగు దేశం పార్టీ మాత్రం ఇప్పటికీ రుణమాఫీ సాధ్యమేనంటూ కథలు చెబుతోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో మాట్లాడి సంపూర్ణ రుణమాఫీ చేస్తామంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఊహాగానాలు వద్దని కేఈ కృష్ణమూర్తి సూచించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సమీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాయలసీమను ఇండస్ట్రీస్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని కేఈ వెల్లడించారు. కాగా రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది. ఇదంతా తెలిసినా టీడీపీ మాత్రం రుణమాఫీ సాధ్యమే అంటూ రైతుల్ని నమ్మించే యత్నం చేస్తోంది. -
టీ సర్కారుకు ఆర్బీఐ షాక్
-
రుణభారం మీదే
* మాఫీపై టీ సర్కారుకు తేల్చి చెప్పిన ఆర్బీఐ గవర్నర్ * ముందుగా రైతులు రుణాలు చెల్లించేలా చూడాలి * తర్వాత ప్రభుత్వం వాయిదాల్లో రైతులకు ఇవ్వాలి * బ్యాంకులను భాగస్వాములను చేయొద్దు * ఆరేడేళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నో * ఇలాంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక స్థితిని దిగజార్చుతాయన్న ఆర్బీఐ సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది! ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ తన వైఖరిని ఏమాత్రం సడలించలేదు. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది. లక్ష రూపాయల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అనుసరించే విధానంపై ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావుతో కూడిన బృందం శుక్రవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో భేటీ అయింది. రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు వివరించారు. దీనికి ఆమోదం తెలపాలని, మాఫీ మొత్తాన్ని ఆరేడు సంవత్సరాల్లో బ్యాంకులకు వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఆర్బీఐ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రానట్లు తెలిసింది. ‘రుణ మాఫీ అంశంలో బ్యాంకులను భాగస్వాములను చేయకండి. ముందుగా రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు తీసుకోండి. ఆ మొత్తాన్ని తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్ని వాయిదాల్లో అయినా రైతులకు వెనక్కి ఇవ్వండి(రీయింబర్స్). ఇలాంటి(రుణ మాఫీ) చర్యలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయి’ అని వ్యాఖ్యానించినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ నుంచి ఊహించని సమాధానం రావడంతో రాష్ర్ట ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. తొలుత రుణ మాఫీతో రాష్ర్ట ప్రభుత్వంపై రూ. 17 వేల కోట్ల మేర భారం పడుతుందని, 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మాఫీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తనున్న దృష్ట్యా ఈ భారాన్ని రూ. పదివేల కోట్లకే పరిమితం చేయాలని సర్కారు భావించింది. రుణాలకు ఏడాది పరి మితి విధించనున్నట్లు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే రైతులు, రాజకీయపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. బంగారం తాకట్టు రుణాలు సహా ఎలాంటి పరిమితి లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రుణాల చెల్లింపు మార్గాలపై, నిధుల సమీకరణపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. రైతులకు భారం లేకుండా రుణాలను ఆరేడు సంవత్సరాలకు రీ-షెడ్యూల్ చేయాలని, ఆ వాయిదాల మొ త్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైతే ప్రభుత్వ భూములను తనఖా పెడతామని, ప్రభుత్వ ఖాతాలను పూర్తిగా ఈ బ్యాంకుల్లోనే ఉంచుతామని కూడా అధికారులు పేర్కొంటున్నారు. అయితే బాండ్ల జారీ, రుణాల రీ షెడ్యూల్ వంటివి చేపట్టడం అసాధ్యమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి వాటితో తమ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఇప్పటికే ఒకట్రెండు ప్రభుత్వ బ్యాంకులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో పాటించే విధానాన్ని ఖరారు చేసుకునేందుకు ఆర్బీఐ గవర్నర్‌తో రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు భేటీ అయ్యాయి. అయితే రుణ మాఫీని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా... అది ప్రభుత్వ బాధ్యతేనని, తమకు సంబంధం లేదన్న సంకేతాలిచ్చారు.