
అయినా అసంతృప్తే
సంతృప్తి అన్నది లేకుంటే మనిషిలో అశాంతి రగులుతుంది. మందులకు కూడా తగ్గని మాయరోగం అది. ఆశించడంలో తప్పులేదు. దక్కని దాని కోసం దిగులు పడటం ఒంటికి, ఇంటికి మంచిది కాదు. ఇది గ్రహించకనే నటి కాజల్ అగర్వాల్ అశాంతితో రగిలిపోతున్నారట. కోలీవుడ్ వరకు చూసుకుంటే కాజల్ పొజిషన్ మునుపటి కంటే బెటరే. తొలి రోజుల్లో ఎంతగా పోరాడి నా విజయాన్ని చేరుకోలేకపోయారు. కార్తీ సరసన నటించిన నాన్ మహన్ అల్ల చిత్రం ఆమె కోలీవుడ్ కెరీర్‌లో ఆనందాన్ని నింపిన చిత్రం. ఆ తరువాత తుపాకీ, జిల్లా చిత్రాలు సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.
ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్ అంటూ నటిగా బిజీగానే ఉన్నారు. తమిళంలో ధనుష్, విశాల్‌తో నటిస్తున్నారు. అయినా కాజల్‌ను నిరాశనే వెంటాడుతోందట. కారణం ఏమిటబ్బా అని ఆరా తీస్తే అజిత్ తాజా చిత్రంలో అవకాశం దక్కించుకోవడానికి చాలానే ప్రయత్నించి విఫలం అయ్యారట. అజిత్ 56వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ అవకాశం తనకే వస్తుందని కాజల్ ఆశించార ట. అది కాస్త చివరి దశలో నటి శృతిహాసన్ తన్నుకుపోవడమే కాజల్ అసంతృప్తికి కారణం అని తెలిసింది.