'ఆర్ ఎస్ ఎస్ డైరెక్షన్ లో మోదీ సర్కార్'
న్యూఢిల్లీ:
మంగళవారం ఢిల్లీలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీలో సోనియా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుందనడానికి భూసేకరణ బిల్లు ఉపసంహరించుకోవడమే నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం పుంజుకోలేదని, ఉపాధి కల్పన పెరగలేదని తెలిపారు. ధరలు పెరిగాయని, స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని ధ్వజమెత్తారు.
పాకిస్థాన్ తో సంబంధాలపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని దుయ్యబట్టారు. కాగా పార్టీ సంస్థాగత మార్పులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.