రాయల-తెలంగాణ ఊహాగానమే:పాల్వాయి | Telangana statehood: UPA Coordination panel to meet on July 31 | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 29 2013 12:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాలు మంగళవారం సమావేశం కానున్నాయి. రేపు సాయంత్రం 3.30 గంటలకు యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం, అనంతరం 5.30 గంటలకు సీడబ్ల్యూసీ సైతం సమావేశమవుతుందని.. తెలంగాణపై ఓ స్పష్టమైన వైఖరిని చెప్పనున్నట్లు తెలుస్తోంది. యూపీఏ, సీడబ్లూసీ సమావేశాలు జరుగుతాయని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో యూఏపీ సమన్వయ కమిటీ సమావేశం, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. రేపు రాత్రి 7 గంటలకల్లా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement