రబీతో పాటు సాధారణ పంటల నీటి అవసరాలను తీర్చడం, సాగు, తాగునీటి వంటి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్టుగా సీడబ్ల్యూసీ పేర్కొందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్ తెలిపారు.
న్యూఢిల్లీ, సాక్షి: రబీతో పాటు సాధారణ పంటల నీటి అవసరాలను తీర్చడం, సాగు, తాగునీటి వంటి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్టుగా సీడబ్ల్యూసీ పేర్కొందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యామ్నాయ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించినట్లు తెలి పారు.
ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఈ ప్రతిపాదన రూపొందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇటు సాంకేతికంగా అటు ఆర్థికంగానూ అది సాధ్యం కాదనే నిర్ణయానికొచ్చింది. గోదావరి నదిపై వరుసగా బ్యారేజీలు నిర్మిం చాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనే, ఎంపీ పాల్వా యి గోవర్ధన్‌రెడ్డి ద్వారా జల వనరుల మంత్రిత్వ శాఖకు కూడా అందింది. ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ పరిశీలించింది..’ అని రావత్ చెప్పారు. బ్యారేజీలనేవి నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు పరిమితంగా నిల్వ చేసేందుకు ఉపయోగపడే మళ్లింపు నిర్మాణాలుగా సీడబ్ల్యూసీ అభిప్రాయపడినట్లు తెలిపారు.