న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) జూన్ 6న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పదోన్నతి కల్పించడంతో పాటు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దాదాపు ఏడు నెలల అనంతరం జరుగనున్న ఈ భేటీలో సంస్థాగత ఎన్నికల తేదీలపై కూడా స్పష్టత రావచ్చని వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చించనున్నారు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ ప్రాధాన్యం సంతరించుకుంది.
6న రాహుల్ పదోన్నతిపై చర్చ!
Published Sun, Jun 4 2017 1:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
Advertisement
Advertisement