కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఆమె పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయాలని, అన్ని విభాగాలకు ఓకే సభ్యత్వం ఉండాలని తీర్మానించారు. పార్టీలో 50 శాతం పదవులను ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మహిళలకు కేటాయించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.