తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం మాత్రమే మిగిలివుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. 'తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూద్దాం' అంటూ రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రధాని నివాసంలో దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చలు జరిపింది. ఈ భేటీకి సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, చిదంబరం హజరయ్యారు. పత్ర్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.