రాజీనామాకు సిద్దపడ్డ సోనియా, రాహుల్
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం దానిని తిరస్కరించింది. అంతేకాకుండా వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాదాపు మూడు గంటలసేపు సమావేశమైంది.
సార్వత్రిక ఎన్నికలలలో ఓటమిపై సమావేశంలో సమీక్షించారు. కారణాలను విశ్లేషించారు. ఓటమికి గలకారణాల అన్వేషణకు ఓ కమిటీ ఏర్పాటు చేసే విషయమై చర్చించారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి సోనియా, రాహుల్ సిద్దపడ్డారు. అయితే సమావేశం అందుకు అంగీకరించలేదు. వారే కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫలితాలు నిరాశకలిగించినట్లు సోనియా చెప్పారు.