dehli
-
ఏబీసీ చైర్మన్‌గా రియాద్ మాథ్యూ
న్యూఢిల్లీ: పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్ అసోసియేట్ ఎడిటర్ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్ బజాజ్ (ఐటీసీ) డిప్యూటీ ౖచైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్ జైన్ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఏబీసీ మేనేజ్మెంట్ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు.. పబ్లిషర్స్ ప్రతినిధులు: రియాద్ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్ జి.పవార్ (సకాల్ పేపర్స్), శైలేష్ గుప్తా (జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్), ప్రవీణ్ సోమేశ్వర్ (హెచ్‌టి మీడియా లిమిటెడ్), మోహిత్ జైన్ (బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్ లిమిటెడ్), కరణ్ దర్దా (లోక్మత్ మీడియా ప్రై. లిమిటెడ్), గిరీష్ అగర్వాల్ (డీబీ కార్ప్ లిమిటెడ్). ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్ బజాజ్ (ఐటీసీ లిమిటెడ్), అనిరుధ హల్దార్ (టీవీఎస్ మోటర్స్ కంపెనీ లిమిటెడ్), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్). యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్ కె.స్వామి (ఆర్కే స్వామి లిమిటెడ్), విక్రమ్ సఖుజా (మాడిసన్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), ప్రశాంత్ కుమార్ (గ్రూప్ ఎం మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), వైశాలి వర్మ (ఇనీíÙయేటివ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), సేజల్ షా (పబ్లిక్స్ మీడియా ఇండియా గ్రూపు). -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్‌గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్‌లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్‌చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్‌చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను విచారించారు. కవిత పిటిషన్‌ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్‌రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్‌కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్‌చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
పంచ ‘న్యాయ్’లతో ప్రజలకు న్యాయం చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువత, శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చాలని నిర్ణయించింది. పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాం«దీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ‘భారత్ వెలిగిపోతోంది’ నినాదానికి ఏ గతి పట్టిందో, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు అదే గతి పడుతుంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
సోనియా గాంధీకి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. అయిత పార్టీ వర్గాల మాత్రం సాధారణ చెకప్‌గా చెబుతున్నారు. కాగా ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె గతంలో కూడా చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
-
ఢిల్లీలో విషాదం, 43మంది మృతి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 43మందికి పైఆగా మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. రాణిఝూన్సీలోని అనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ మరోవైపు ఈ ప్రమాదం నుంచి సుమారు 50మందిని సురక్షితంగా కాపాడినట్లు చెప్పారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు 30 ఫైర్ ఇంజన్లుతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదంతో సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. The fire in Delhi’s Anaj Mandi on Rani Jhansi Road is extremely horrific. My thoughts are with those who lost their loved ones. Wishing the injured a quick recovery. Authorities are providing all possible assistance at the site of the tragedy. — Narendra Modi (@narendramodi) December 8, 2019 మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ... సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గప్‌చుప్ తింటుండగా మాజీ ఎమ్మెల్యేపై దోపిడీ!
రోడ్డుపక్కన ఉన్న గప్‌చుప్‌ల బండి వద్ద ఆగి పానీపూరి తింటుండగా.. ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపక్కన కారు ఆపి.. తన స్నేహితుడితో కలిసి తీరికగా గప్‌చుప్‌లు తింటుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన కారులో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగును దొంగలించారు. ఆ బ్యాగులో ఆయన ల్యాప్‌టాప్‌తోపాటు డిజిటల్ కెమెరా, పార్టీ సీనియర్ నేతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని లాడో సరై ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దొంగలను వెంటాడి పట్టుకొనేందుకు బీజేపీ నేత ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్ ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయ్ జోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎవరన్నది ఇంకా తెలియలేదు. విజయ్ జోలీ బుధవారం సాయత్రం తన ఐ20 కారులో సంగం విహార్ నుంచి జానకీపూర్ బయలుదేరారు. ఆయన వెంట స్నేహితుడు కూడా ఉన్నారు. ఇద్దరు లాడో సరై ప్రాంతంలో రోడ్డు పక్కన కారును పార్క్ చేసి.. పక్కనే ఉన్న గప్‌చుప్‌ల బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ తాము గప్‌చుప్‌లు తింటుండగానే బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కారు కిటికీ అద్దాన్ని పగులకొట్టి కారులోని ల్యాప్బ్యాగ్ను ఎత్తుకెళ్లారని, వారిని పట్టుకునేందుకు తాను ప్రయత్నించినా ట్రాఫిక్ ఉండటంతో వీలుపడలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.