కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 8న ఢిల్లీలో సమావేశం కానుంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 8న ఢిల్లీలో సమావేశం కానుంది. భూ సేకరణ ఆర్డినెన్స్‌పై మోదీ సర్కారు వెనక్కి తగ్గడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, సీఎంలు రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌ను ఎలా తీవ్రతరం చేయాలనే అంశాలు చర్చకు రావొచ్చని తెలుస్తోంది.
వర్తమాన రాజకీయ పరిస్థితిపై చర్చించడానికి ఈనెల 8న సీడబ్ల్యూసీ భేటీ అవుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది వెల్లడించారు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీన్ని మళ్లీ మూడేళ్లకు తగ్గిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.