కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం కడపలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గతంలో సీడబ్ల్యూసీ ముందుగా నిర్ణయం తీసుకన్న అనేక అంశాలను వెనక్కి తీసుకున్న సంఘటనలు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.