సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈ నెల 9న ఢిల్లీలో భేటీ కానుంది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు కులగణన, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో చిక్కులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ సహా మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అధికారం కాపాడుకోవడం లక్ష్యంగా సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment