నేడు టీపీసీసీ కీలక భేటీ | first meeting of the Telangana Pradesh Congress Committee will be held on Thursday | Sakshi
Sakshi News home page

నేడు టీపీసీసీ కీలక భేటీ

Published Thu, May 30 2019 3:20 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

 first meeting of the Telangana Pradesh Congress Committee will be held on Thursday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కీలక భేటీ గురువారం జరగబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గురువారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేతలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమీక్షతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థులను ఆహ్వానించినట్లు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement