beerappa
-
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu -
కాటేసిన కరెంట్
పెనుకొండ రూరల్ : పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పైనున్న గవాచి మూయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ తీగలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్లు వివరించారు. -
అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మృతి
టేక్మాల్: అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మరణించిన ఘటన టేక్మాల్ మండలం కాద్లూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక ఎస్ఐ మధుకుమార్ కథనం ప్రకారం... కాద్లూర్ గ్రామానికి చెందిన పోతులబొగుడ కిష్టయ్య, లచ్చమ్మ దంపతులు. వీరి రెండో కుమారుడు బీరప్ప(32). ఇతని రెండున్నరేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు. బీరప్పతోపాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు అంతా కలిసి హైదరాబాద్‌లోని షాపూర్లో ఉంటున్నాడు. కొంత కాలంగా అతను ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులతో చెప్పిన బీరప్ప ఓ వివాహితను తీసుకొని మంగళవారం కాద్లూర్ వచ్చాడు. వచ్చిన నాటి నుంచి ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. శుక్రవారం ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో సర్పంచ్ యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఎంత నెట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో పైభాగం నుంచి ఇంట్లోకి చేరుకుని తలుపులు తీశారు. ఓ మహిళ మృతదేహం నేలపై ఉండగా బీరప్ప శవం దూలానికి వేలాడుతూ కన్పించింది. అక్కడున్న బ్యాగ్‌ను వెతికారు. అందులో ఉన్న ఎటీఎం కార్డు, ఆధార్‌కార్డుల ద్వారా ఆ మహిళను రత్నకుమారి(38)గా గుర్తించారు. ఈమె హైదరాబాద్‌లోని షాపూర్‌కు చెందిన ఓ సినీ ఆర్టిస్ట్ తల్లిగా ధ్రువీకరించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో స్థానికంగానే పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని జోగిపేట సీఐ నాగయ్య పరిశీలించారు. మృతుడి సోదరుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకుమార్ తెలిపారు. -
ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు
టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాజులూరు గ్రామంలోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు శుక్రవారం ఉదయం వెలుగుచూశాయి. బీరప్ప(32) అనే వ్యక్తి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా బీరప్ప, ఓ మహిళ మృతదేహం కనిపించాయి. అక్కడున్న ఓ బ్యాగును తెరచి చూడగా అందులో ఇద్దరు మహిళల ఫొటోలు ఉన్నాయి. వారిలో మృతి చెందింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. రంగారెడ్డి జిల్లా షాపూర్లో ఓ కంపెనీలో పనిచేసే బీరప్ప నాలుగు రోజుల క్రితం ఓ మహిళతో గ్రామానికి వచ్చినట్టు స్థానికుల కథనం. వీరు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.