ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు | two dead bodies in one house | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో రెండు మృతదేహాలు

Published Fri, May 29 2015 8:37 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two dead bodies in one house

టేక్‌మాల్: మెదక్ జిల్లా టేక్‌మాల్ మండలం కాజులూరు గ్రామంలోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు శుక్రవారం ఉదయం వెలుగుచూశాయి. బీరప్ప(32) అనే వ్యక్తి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా బీరప్ప, ఓ మహిళ మృతదేహం కనిపించాయి. అక్కడున్న ఓ బ్యాగును తెరచి చూడగా అందులో ఇద్దరు మహిళల ఫొటోలు ఉన్నాయి. వారిలో మృతి చెందింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

రంగారెడ్డి జిల్లా షాపూర్‌లో ఓ కంపెనీలో పనిచేసే బీరప్ప నాలుగు రోజుల క్రితం ఓ మహిళతో గ్రామానికి వచ్చినట్టు స్థానికుల కథనం. వీరు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement