ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ పోలీసుల అధికారులకు సూచించారు. శుక్రవారం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. జాతరలో పోలీసు అధికారులకు కేటాయించిన సెక్టార్ ప్రాంతంలోని పనులు, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. జాతరలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
జాతర ఏర్పాట్ల పనులంటినీ త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతర సమీపిస్తుండడంతో లక్షలాది మంది భక్తులు దేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారని వారికి భద్రత పరంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. దొంగతనాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గద్దెల ప్రాంగణంలోని భక్తుల క్యూలైన్లు, పోలీసు క్యాంపులో వసతి, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, హోల్టింగ్ పాయింట్లతో పాటు వివిధ రూట్లను ఎస్పీ పరిశీలించారు. సమీక్షలో అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్, ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డె, వరంగల్ పోలీసు కమిషనరేట్ అడిషనల్ డీసీపీ మురళీధర్, డీఎస్పీలు రాఘవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, కేఆర్‌కే.ప్రసాద్, సీలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment