
ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పని చేసిపెట్టేందుకు లంచం అడుగుతున్నారా? ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలు మీ వద్ద ఉన్నాయా?.. వీటిపై ఫిర్యాదు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ కేంద్రంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ అధికారులు ఫిర్యాదు అందుకున్న వెంటనే కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించి చర్యలు తీసుకుంటారు. నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
తిరుపతి క్రైం : ఆధునిక సమాచారం, సాంకేతిక పరి జ్ఞానం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నా, ఆ సంస్థల్లో చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాల వల్ల ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత లోపిం చడం, జవాబుదారిపాలన కరువై పోవడం, నియామకాల్లో పక్షపాతం.. ఇవన్నీ అవినీతికి మూలాలుగా నిలుస్తున్నా యి. సమాజానికి పట్టిన అవినీతి జాడ్యాన్ని వదిలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లి.
అవినీతిని అరికట్టేందుకు ఏం చేయాలి..?
⇒ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పథకాల ఎంపికలో దళారులు, రాజకీయ జోక్యం అరికట్టాలి.
⇒ ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిలదీయాలి లేదా ఏసీబీని ఆశ్రయించాలి.
⇒ ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
⇒ ఏసీబీ, విజిలెన్స్ శాఖల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తే నిరంతరం తనిఖీలు చేసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న విభాగాలివే..
⇒ పౌరసరఫరాల శాఖలో వినియోగదారుడికి సరుకులు సక్రమంగా అందడం లేదు. తూనికలు, కొలతల్లో మోసం జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.
⇒ రెవెన్యూ విభాగంలో ఆర్డీఓ కార్యాలయం మొదలుకుని పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అవినీతి పేరుకుపోయింది.
⇒ ఈ విభాగాల్లో ఎక్కువ మంది ఏసీబీకి పట్టుబడటం గమనార్హం.
⇒ సంక్షేమ వసతిగృహాల్లో పిల్లలకు ఇచ్చే మెనూలో నిబంధనలు పాటించడం లేదు.
⇒ పోలీసు శాఖలో అవినీతి పెచ్చుమీరిపోయింది. హోంగార్డు నుంచి అధికారి వరకు లంచం లేనిదే ఏ పనీ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
⇒ పురపాలక శాఖలో కొళాయి పన్ను నుంచి భవన నిర్మాణానికి అనుమతి పత్రాల మంజూరు వరకు మామూళ్లు ఇవ్వాల్సిందే.
గత అయిదేళ్లలో ఏసీబీ కేసులివే..
⇒ 2012 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఒకటి, దాడుల కేసులు 4, ట్రాపింగ్ కేసులు 9 నమోదయ్యా యి.
⇒ 2013లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ట్రాపింగ్ కేసులు 13, ఇతరత్రా దాడుల్లో 5 కేసులు.
⇒ 2014లో ఆదాయానికి మించిన కేసు ఒకటి, ట్రాపిం గ్ కేసులు 19, ఇతరత్రా దాడుల కేసులు 10 నమోదు.
⇒ 2015లో 18 ట్రాపింగ్ కేసులు, ఇతర కేసులు రెండు, ఆకస్మిక దాడులు 10.
⇒ 2016లో 10 ట్రాపింగ్ కేసులు, 2 ఆదాయానికి మించిన కేసులు, 2 ఆకస్మిక తనిఖీలు.
⇒ 2017లో ఇప్పటి వరకు 3 ట్రాపింగ్ కేసులు, 4 ఆకస్మిక తనిఖీలు, 2 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 4 రెగ్యులర్ ఎంక్వైరీలు.
లంచగొండులను వదలం..
లంచం తీసుకునేవారిని, ప్రోత్సహించేవారు ఏసీబీ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయిలో నిఘా ఉంచాం. సొంత శాఖ అయిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, తుడాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు దక్కాల్సిన వాటిల్లో కూడా లంచాలు తీసుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. గృహనిర్మాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో కూడా లంచగొండులు పెరిగిపోతున్నారు. అలాంటివి ఏవైనా ఉంటే మాకు ఫిర్యాదు చేయండి. ఏసీబీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఏసీబీ డీఎస్పీ నంబర్ – 9440446190,సీఐలు –9440446138, 9440808 112. 1064కు కాల్ చేస్తే ప్రతి ఒక్క మాట రికార్డు అవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– శంకర్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment