దిశ ఘటన అనంతరం పెరిగిన కాల్స్
దిశ ఘటన తరువాత డయల్ 100, 112లకు కాల్స్ గణనీయంగా పెరిగాయి. వాటిలో ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో నిజమైన బాధితులకు ఫోన్‌లైన్లు బిజీ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. డయల్ 112కు ప్రైమరీ రేట్ ఇంటర్‌ఫేస్(పీఆర్‌ఐ) రెండు లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో లైను ద్వారా సెకనుకు 30 కాల్స్ చొప్పున రెండు లైన్లకు మొత్తం 60 కాల్స్ మాట్లాడవచ్చు. అంతకు మించి వచ్చే కాల్స్‌తో లైన్స్ బిజీ అని వస్తోంది. పెరిగిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సమస్యను అధిగమించేలా మరో రెండు పీఆర్‌ఐ లైన్లు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు.
కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లలో కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నుంచి నేరుగా డయల్ 112కు ఎమర్జన్సీ కాల్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం లేని వారు ఫోన్‌లోని పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్లి కట్ అవుతుంది. అనంతరం వారిలొకేషన్ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. వారు తిరిగి కాల్ చేసి సమస్య కనుక్కుంటారు. బేసిక్ మోడల్ ఫోన్ కీ ప్యాడ్‌లో 2 లేదా 9 అంకెను నొక్కి పెడితే డయల్ 112కు కాల్ వెళ్లిపోతోంది.
►టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా కాల్ చేస్తున్నారు.
►కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలో టోల్‌ఫ్రీ నెంబర్లకు పెద్దఎత్తున వస్తున్న ఫోన్‌కాల్స్‌తో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100, 112 నెంబర్లకు రోజూ లెక్కకు మిక్కిలి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో పోలీసులు పరిష్కరించదగ్గ అంశాలకు సంబంధించి కాల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగిలిన ఫిర్యాదులన్నీ టోల్‌ఫ్రీ నెంబర్ పనిచేస్తుందా? ఫిర్యాదులు తీసుకుంటున్నారా? సమాచారం కోసం, అవినీతిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ వివరాలు అందించాలి? అనే వివరాలు తెలుసుకునేందుకే చేయడం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫేక్ కాల్స్ బెడద పెరగడంతో అసలు ఆపదలో ఉన్నవారికి లైన్ కలవక ఇబ్బంది పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
–సాక్షి, అమరావతి
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళలు, ప్రజలు తమ సమస్యలను ఈ నెంబర్లకు
ఫోన్ చేసి చెప్పిన అతి తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలను సది్వనియోగం చేసుకోవాలి. టోల్‌ఫ్రీ నెంబర్లపై అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం.
–గౌతమ్ సవాంగ్, డీజీపీ
అసలైన బాధితులు నష్టపోతారు
టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసు సేవలు పొందే అవకాశం ఉంది. డయల్ 100, 112ను సద్వినియోగం చేసుకుంటేనే వాటి ఏర్పాటుకు సార్ధకత ఉంటుంది. దుర్వినియోగం చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం చేసినవారవుతాం.
–ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి జాతీయ కమిషనర్
డిసెంబర్ 12న టోల్‌ఫ్రీ నెంబర్లకు నమోదైన ఫోన్‌కాల్స్‌విశ్లేషిస్తే
►16,207డయల్ 100కు వచ్చిన కాల్స్
►533 వాటిలోపోలీసులు స్పందించదగినవి
►516 కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించినవి
►17 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేసులు
3.50లక్షలుడయల్ 112కు వచ్చిన కాల్స్
►వాటిలో పోలీసులు స్పందించదగ్గవి1,779
►కేసులు నమోదు చేసినవి2
►రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు గత నెల 25న డయల్ 14400 నెంబర్‌ను ప్రారంభించారు
►డయల్ 14400కు తొలి రోజు వచి్చన కాల్స్ 5100
►వాటిలో ఏసీబీకి వచి్చన ఫిర్యాదులు కేవలం 283 మాత్రమే
Comments
Please login to add a commentAdd a comment