కోటగుమ్మం (రాజమండ్రి) : మనమేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్ నుంచి 108కి ఫోన్ చేసి, సమాచారం అందిస్తాం. ఒక్క ఫోన్‌కాల్‌తో రెండు నిండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. ఈ టోల్‌ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం.
155333 (ఏపీఈపీడీసీఎల్) : విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజి, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సమస్యలను ఈ నంబర్‌కు చెప్పవచ్చు.
1910 (బ్లడ్ బ్యాంక్స్) : అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబరులో తెలుసుకోవచ్చు.
1950 (ఎన్నికల సంఘం) : ఓటరు నమోదు, తొలగింపులు, పేరుమార్పిడి, ఓటుమార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
1100 (మీ-సేవ) : ఆయా ప్రాంతాల్లో మీ-సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
1800-425-1110 (వ్యవసాయ శాఖ) : ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.
1800-200-4599 (ఏపీఎస్ ఆర్టీసీ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు.
101 (అగ్ని మాపక శాఖ) : అగ్ని ప్రమాదం సంభవిస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే, సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయక చర్యలు చేపడతారు. విపత్తుల
నిర్వహణలో సేవలు అందిస్తారు.
108 (ఎమర్జెన్సీ అంబులెన్స్) : ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వచ్చి, వైద్య సిబ్బంది .చికిత్స అందిస్తారు. ఇంటివద్ద ఉన్న రోగులనూ అతస్యవసరంగా ఆస్పత్రికి చేరవేస్తారు.
1997 (హెచ్‌ఐవీ-కంట్రోల్‌రూమ్) : హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధులపై, బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు.
100 (పోలీసు శాఖ) : పోలీసుల తక్షణసాయం పొందవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
131 (రైల్వే శాఖ) : రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ సమాచారం తెలుస్తోంది.
1090 (క్రైం స్పెషల్ బ్రాంచ్) : చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. ఇది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్‌కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు.
155361 (అవినీతి నిరోధక శాఖ) : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వవచ్చు.
155321 (ఉపాధి హామీ పథకం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్ధంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు.
198 (బీఎస్‌ఎన్‌ఎల్) : సంస్థకు చెందిన టెలిఫోన్ సమస్యలపై వినియోగదారులు ఈ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.
1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) : ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకునేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబరుకు తెలియజేయవచ్చు.
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..టోల్ ఫ్రీ
Published Tue, Feb 9 2016 1:16 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement