రెండో విడత రుణమాఫీ అంశానికి సంబంధించి రైతుల ఖాతాల వివరాలను శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పెట్టింది.
హైదరాబాద్:రెండో విడత రుణమాఫీ అంశానికి సంబంధించి రైతుల ఖాతాల వివరాలను శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పెట్టింది. నలభై రెండు లక్షలకు పైగా ఖాతాలను ఆన్ లైన్ లో పెట్టిన ప్రభుత్వం.. వాటిని సవరణల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఒకవేళ ఈ జాబితాలో రుణమాఫీ పొందలేకపోతే.. ఎందుకు పొందలేదో పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. దీంతోరుణమాఫీ ధ్రువపత్రాలను జనవరి 9వ తేదీ లోపు రైతులు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం దక్కనుంది.
రైతుల రుణమాఫీపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. 1800 103 2066 అనే నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఈ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు, బ్యాంకర్లకు వేర్వేరుగా ఐడీలు కేటాయించారు.