08772240201 ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్
ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్
నిరంతరం అందుబాటులో కాల్ సెంటర్
రెండో రోజు నామినేషన్లు నిల్
తిరుపతి తుడా: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వి.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నిక తీరు, అభ్యర్థుల లోటుపాట్లపై ఫిర్యాదు చేసేందుకు 0877-2240201 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఫ్యాక్స్/ఈ-మెయిల్/ ఎస్‌ఎంఎస్/ స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కాల్ సెంటర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజూ దీని పై తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అన్ని స్థాయి బృందాలు సోమవారం నుంచే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ర్యాలీ, ఊరేగింపులకు సంబంధించిన అన్ని ఖర్చులను అభ్యర్థి ఖాతాలో చేరుస్తారని పేర్కొన్నారు.
రెండో రోజు నామినేషన్లు నిల్
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.మంగళవారం సెంటిమెంట్ కారణంగా నామినేషన్లు వేయకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తొలి రోజు సోమవారం 12 నామినేషన్ల దరఖాస్తులను అభ్యర్థులు తీసుకెళ్లారు. వీరెవ్వరూ ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు.