Tirupati assembly by-election
-
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
నిర్ణయం ప్రకటించిన అధిష్టానం అందరి ఆమోదం మేరకే నిర్ణయం చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చర్చించి నిర్ణయించారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అధికార పార్టీ తరపున వెంకటరమణ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. ఈ పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వైఎస్సార్సీపీ అధిష్టానం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో జగన్మోహన్రెడ్డి చర్చించారు. తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పేర్కొన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
08772240201 ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్
ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్ నిరంతరం అందుబాటులో కాల్ సెంటర్ రెండో రోజు నామినేషన్లు నిల్ తిరుపతి తుడా: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వి.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నిక తీరు, అభ్యర్థుల లోటుపాట్లపై ఫిర్యాదు చేసేందుకు 0877-2240201 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఫ్యాక్స్/ఈ-మెయిల్/ ఎస్ఎంఎస్/ స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కాల్ సెంటర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజూ దీని పై తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అన్ని స్థాయి బృందాలు సోమవారం నుంచే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ర్యాలీ, ఊరేగింపులకు సంబంధించిన అన్ని ఖర్చులను అభ్యర్థి ఖాతాలో చేరుస్తారని పేర్కొన్నారు. రెండో రోజు నామినేషన్లు నిల్ తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.మంగళవారం సెంటిమెంట్ కారణంగా నామినేషన్లు వేయకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తొలి రోజు సోమవారం 12 నామినేషన్ల దరఖాస్తులను అభ్యర్థులు తీసుకెళ్లారు. వీరెవ్వరూ ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు.