తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం | YSR Congress not to contest tirupati by-election | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం

Published Fri, Jan 23 2015 2:43 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి  వైఎస్సార్ సీపీ దూరం - Sakshi

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం

నిర్ణయం ప్రకటించిన అధిష్టానం
అందరి ఆమోదం మేరకే నిర్ణయం


చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అధికార పార్టీ తరపున వెంకటరమణ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. ఈ పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో జగన్‌మోహన్‌రెడ్డి  చర్చించారు. తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పేర్కొన్నారు.  సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement