ఏటీఎం కార్డు బ్లాక్ అయితే కంగారుపడొద్దు
ఒకే రోజు ఏటీఎం కార్డు పిన్‌కోడ్‌ను మూడు సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే కార్డును బ్లాక్ చేస్తారు. అది కూడా కేవలం వినియోగదారుని ప్రయోజనాల కోసమే. కార్డు ఎవరికైనా దొరకడమో, లేదా దొంగిలించి ఖాతాలోని సొమ్ములను తస్కరించడానికి చేసే ప్రయత్నాలను నివారించడం కోసమే బ్యాంకులు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అసలైన ఖాతాదారుడు తమ బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా మరుసటి రోజుకి తమ కార్డును మామూలుగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసేటప్పుడు ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతా పుస్తకం, ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. ఈ సేవను పునరుద్ధరించుకోవడానికి సంబంధిత బ్యాంక్ యాజమాన్యానికి సంతృప్తికరైమైన సమాచారం అందించాల్సి ఉంటుంది.