
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ అందుబాటులో ఉండేలా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ సహకారం తీసుకోవాలంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. డయల్–100కు అదనంగా జోన్ల స్థాయిలో మరికొన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆయా నంబర్లు ఇవి..
ప్రధాన కంట్రోల్ రూమ్: 040–27852333, 27852435, 27852436, 9490616690
సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852759, 9490598979
ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853562, 9490598980
నార్త్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853599, 9490598982
సౌత్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27854779, 9490616551, 7013299622
వెస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852483, 9490598981
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040–27852482, 9490598985
ట్రాఫిక్ హెల్ప్ లైన్: 9010203626