Help Line
-
సిటీ పోలీసు హై అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ అందుబాటులో ఉండేలా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ సహకారం తీసుకోవాలంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. డయల్–100కు అదనంగా జోన్ల స్థాయిలో మరికొన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయా నంబర్లు ఇవి.. ప్రధాన కంట్రోల్ రూమ్: 040–27852333, 27852435, 27852436, 9490616690 సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852759, 9490598979 ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853562, 9490598980 నార్త్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853599, 9490598982 సౌత్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27854779, 9490616551, 7013299622 వెస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852483, 9490598981 ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040–27852482, 9490598985 ట్రాఫిక్ హెల్ప్ లైన్: 9010203626 -
మాస్కులు, శానిటైజర్ల ధరలపై హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: మాస్కులు, శానిటైజర్ల ధరల నియంత్రణకు జారీ చేసిన నోటిఫికేషన్ తు.చ. తప్పకుండా అమలయ్యేలా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చి, వాటిపై ప్రచారం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మాస్కులు, శానిటైజర్ల ధరలను దుకాణదారులు భారీగా పెంచడంపై ‘జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్’అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. శానిటైజర్లు, లిక్విడ్ సోప్, మాస్కుల ధరల నియంత్రణకు జారీ చేసిన ఆదేశాలు అమలుకాని సందర్భాల్లో ప్రజలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది.(9 గంటలకు.. 9 నిమిషాల పాటు) అదేవిధంగా, పౌరులందరికీ కోవిడ్ పరీక్షలు ఉచితంగా జరిపించాలంటూ దాఖలైన పిల్, వలస కార్మికులకు కేంద్రమే వేతనం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. రిసార్టులు, హోటళ్లను షెల్టర్లుగా మార్చి, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లకుండా ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వరకు ‘పిల్లు వేయడమే పనిగా పెట్టుకున్న వారి’పై లాక్డౌన్ విధించాలని కేంద్రం వ్యాఖ్యానించింది. యావత్ అధికార యంత్రాంగం తమ శక్తియుక్తులను కరోనాపై పోరుకు ధారపోస్తున్న ఈ కష్ట సమయంలో, ఏసీ గదుల్లో కూర్చున్న కొందరు వేసే పిల్ల కారణంగా అధికారులు విలువైన సమయాన్ని వృథా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. (మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత ) -
నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రజాదరణ మూటగట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోలో’కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి రెండు రోజుల్లోనే 2 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరో లక్ష మంది వారి అభిప్రాయాలను హెల్ప్‌లైన్ నెంబర్, వెబ్‌సైట్‌ల్లో పంచుకున్నారు. ఇంకా ఫోన్ కాల్స్‌ని లెక్కిస్తూనే ఉన్నాం. భారీ స్పందన లభిస్తోంది’అని వెల్లడించాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూసిన మమతా బెనర్జీ తిరిగి ప్రజాదరణ సమకూర్చుకునే దిశగా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడానికి వెయ్యి మందికి పైగా పార్టీ నేతలు రానున్న 100 రోజుల్లో 10వేల గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా ప్రారంభించిన ఈ భారీ ప్రజాదరణ కార్యక్రమం కోసం మమతా.. 9137091370 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. -
ఫలితాలు చెప్పే ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన యాప్ చెక్ పెట్టేస్తుంది. ఈ యాప్‌ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్‌లోకి నేరుగా వచ్చేస్తాయి. దీంతో మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్లో కావలసిన నియోజకవర్గం అప్డేట్స్ చూసుకోవచ్చు. రిటర్నింగ్ అధికారి ప్రకటించే వరకూ వేచిచూసే అవసరం లేకుండా ‘ఓటర్ హెల్ప్‌లైన్’ అనే యాప్ ద్వారా మే 23న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఫలితాల వివరాలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కూడా ఈసీ కల్పించింది. (చదవండి: ఓట్ల లెక్కింపులో 25,000 మంది సిబ్బంది) -
విశాఖ ఎంసెట్ కౌన్సిలింగ్ వద్ద గందరగోళం
-
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు: ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద వేడుక అయిన గణేశ్ ప్రతిమల నిమజ్జనానికి యంత్రాంగాలు సర్వసన్నద్ధమయ్యాయి. ప్రధానంగా హుస్సేన్‌సాగర్ తోపాటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన కొలనుల్లో గురువారం నిమజ్జనమహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతోపాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. గురువారం ఉదయం నుంచి ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సంబంధిత వివరాలిలా ఉన్నాయి.. ప్రధాన ఊరేగింపు మార్గం : కేశవగిరి-నాగుల్చింత-ఫలక్‌నుమ-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేవి : ఆర్పీ రోడ్-ఎంజీ రోడ్-కర్బాలామైదాన్-ముషీరాబాద్ చౌరస్తా-ఆర్టీసీ క్రాస్ రోడ్స్- నారాయణగూడ ఎక్స్ రోడ్-హిమాయత్‌నగర్ వై జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేవి : ఉప్పల్-రామాంతపూర్-అంబర్పేట్-ఓయూ ఎన్సీసీ-డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ తో కలుస్తుంది. - వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. - నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. - వెస్ట్-ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. - వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్: సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పుర, హరిబౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్‌పుర, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ వెస్ట్ జోన్: టోపి ఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ సెంట్రల్ జోన్: ఛాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కౌలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్ - నార్త్‌జోన్: కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ఎక్స్ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. సందర్శకులకు పార్కింగ్ : హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి... ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తరువాత : విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తరవాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్ హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇంటర్ డిస్ట్రిక్ట్/స్టేట్ లారీలకు: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ: ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రెతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పుర, నల్గొండ చౌరస్తాలను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు... నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటు నుంచే మళ్ళిస్తారు. హెల్ప్‌లైన్స్ ఏర్పాటు: ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040-27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్న అంజలి
-
రైతు సమస్యలపై హెల్ప్‌లైన్
అనంతపురం అగ్రికల్చర్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ‘డ్రౌట్ సెల్ హెల్ప్‌లైన్’ను ఏర్పాటు చేశారు. రైతుల ఆత్మహత్యలపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ స్పందించారు. హెల్ప్‌లైన్ నిర్వహణకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించారు. అప్పుల బాధలు, ఇతర సమస్యలు ఏవైనా ఉంటే 18004256401 లేదా 08554-246401 నంబర్లకు ఫోన్ చేసి తెలియ జేయాలని కలెక్టరేట్ అధికారులు సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించి.. రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జీవో 421 విడుదలైంది. దీన్ని ఇంతవరకు జిల్లా అధికారులు పట్టించుకోలేదు. అయితే.. రైతు ఆత్మహత్యలపై ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్.. హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చొరవ చూపారు. జిల్లాలో గడిచిన మూడు నెలల్లో 17 మంది రైతులు అప్పుల బాధతో మృతి చెందారు. అయితే.. ఇందులో ఆరుగురు రైతుల కుటుంబాలు మాత్రమే పరిహారానికి అర్హమైనవని అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై గురువారం ‘సాక్షి’లో ‘అన్యాయం’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. మిగిలిన 11 మంది రైతుల ఆత్మహత్యలపై సమగ్రంగా విచారించి నివేదిక పంపాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేపట్టారు. రెండ్రోజుల్లో సమగ్ర నివేదికలను కలెక్టర్‌కు అందజేయనున్నారు. -
ఇంజనీరింగ్ అడ్మిషన్లలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో మార్పులు రానున్నాయి. ఆప్షన్ల నమోదులో స్క్రాచ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉన్నత విద్యాశాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఈ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ విధానంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. గతేడాది రూ.600 ఉన్న కౌన్సెలింగ్ ఫీజు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఒకసారి ఇచ్చిన ఆప్షన్లను మళ్లీ మార్చుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించి హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో ఏయే మార్పులు తీసుకురావాలన్న అంశాలపై శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్‌జైన్, ఎంసెట్ అధికారులు, ప్రవేశాల క్యాంపు అధికారి రఘునాథ్ తదితరులు సమావేశమై చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మరోసారి చర్చించాక అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. కొత్త మార్పులు ఇలా... విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్లలో కాకుండా ఆప్షన్లను హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఇచ్చుకోవాలి. ఒక్కోవిద్యార్థికి గంటన్నర సమయం ఇస్తారు. విద్యార్థితోపాటు ఒక్కరినే హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే విద్యార్థి తన తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఫొటోల్ని అప్లోడ్ చేయాలి. ఆప్షన్ల సమయంలో ఆ ముగ్గురిలో ఎవరో ఒకర్నే విద్యార్థికి సాయంగా హెల్ప్‌లైన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడే విద్యార్థి.. ఆప్షన్ ఇచ్చుకునే హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ కేంద్రానికి మాత్రమే వెళ్లి ఆప్షన్ ఇవ్వాలి. ముందుగా సాంకేతిక విద్యాశాఖ అందజేసే ఫారంలో ఆప్షన్లను ఎంపిక చేసుకుని, తర్వాత ఆన్లైన్లో ఇవ్వాలి. మార్పు చేసుకోవాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రస్తుతమున్న 53 నుంచి 93 వరకు పెంచుతారు. మొత్తంగా 2,500 వరకు కంప్యూటర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అదనంగా ఖర్చవుతుంది. దీంతో కౌన్సెలింగ్ ఫీజు పెంచడంతోపాటు ఆప్షన్లు మార్చుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఎంతనేది త్వరలో నిర్ణయిస్తారు. -
లైఫ్ లైన్ ఫర్ ఎల్లయ్య