
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన యాప్ చెక్ పెట్టేస్తుంది. ఈ యాప్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్‌లోకి నేరుగా వచ్చేస్తాయి. దీంతో మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్లో కావలసిన నియోజకవర్గం అప్‌డేట్స్ చూసుకోవచ్చు.
రిటర్నింగ్ అధికారి ప్రకటించే వరకూ వేచిచూసే అవసరం లేకుండా ‘ఓటర్ హెల్ప్‌లైన్’ అనే యాప్ ద్వారా మే 23న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఫలితాల వివరాలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కూడా ఈసీ కల్పించింది. (చదవండి: ఓట్ల లెక్కింపులో 25,000 మంది సిబ్బంది)
Comments
Please login to add a commentAdd a comment